ఆర్ఆర్ఆర్ : జక్కన్న చెప్పిన రెండు తేడాలు? ఆ ఇద్దరిలో అవే!
ధీరోదాత్తం అయిన కథకు ధారణ ముఖ్యం.. వీరుల స్మరణకు చారిత్రక నేపథ్యం, వాటి గమనం అన్నీ తెలియడం ఇంకా ముఖ్యం.. ప్రాథమికంగా ఓ కథ కల్పితం అయి ఉంటుంది..జీవితం మాత్రం కలలకు సంకలితం అయి ఉంటుంది..కలల సంకలిత ధోరణే
నిర్మలమయిన చెన్నయ్ తీరం ఒక శబ్ద భేరిని విని పొంగిపోతోంది..నిర్మానుష్యం అన్న తీరం అక్కడ లేదు..సమూహ సందోహాల్లో సంతోషాల్లో మునిగి తేలుతున్న అలల సవ్వడిని వింటూ చూస్తూ తరించి పోతున్న ఆ నేల తల్లి వాకిట ఇద్దరు వీరులు తమ గాధను చెబుతున్నారు..ఈ తెలుగు తల్లి పొంగిపోతోంది..బిడ్డల విజయం చూసి తల్లి పొందే ఆనందాలకు అవధులు లేవు..తన బిడ్డల్లాంటి ఇద్దరి కథానాయకుల గురించి దర్శక ధీర చెబుతుంటే తమిళ గాలలు ఆ ఊసులను ఇటుగా మోసుకువస్తున్నాయి..మంచు సోనల నడుమ రెండు తారల ప్రకాశవంతం అయిన ధోరణి ఒకటి ఈ దేశం గుర్తించాలి.. గుర్తిస్తుంది..సినిమా అనే ఓ ప్రభావ వంతమయిన మాధ్యమం మాత్రమే బాధ్యతగా ఇలాంటి ఓ మంచి కథకు ఆలంబన అయిన వేళ దేశం గర్విస్తుంది.. మా తెలుగు నేల పులకించి పరవశిస్తుంది. జననికి జేజే..తారక్ యూ ఆర్ గ్రేట్ చరణ్ యూ ఆర్ రియల్లీ గ్రేట్...
ఇద్దరు తారల మధ్య ఒక దర్శక ధీరుడు ఉన్నారు. ధీరత్వానికి కొనసాగింపు అయి ఉన్నారు. ఒకరు తారక్ మరొకరు చరణ్.. తారక్ తన ఆలోచలకు అనుగుణంగా నటించే సత్తా ఉన్న నటుడు.. చరణ్ ఒక బ్లాంక్ పేపర్ లాంటి మైండ్ తో సెట్లోకి వచ్చిచేయగల నటుడు.. ఒకరు యాంబిషియెస్..మరొకరు మోర్ సెటిల్డ్.. ఈ ఇద్దరూ లేనిదే ఆర్ఆర్ఆర్ లేదు. అంతేకాదు ఈ సినిమా కథ రాసుకున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా వీరి ప్రయాణం మరువలేను అంటూ రాజమౌళి ఉద్వేగానికి లోనయ్యారు. భావోద్వేగ ఉద్ధృతిలో భాగంగా ఎన్నో మంచి మాటలు చెప్పారు. ఒక కథకు ప్రాణ స్వరంగా నిలిచే నటులు దొరకడం అదృష్టం.. ఓ విధంగా భాగ్యశీలి అంటారు కదా! అదే ఇది.