అఖిల్ ఏజెంట్.. ఈసారి మాస్ మసాలా ట్రీట్ పక్కా..!
ఇప్పటికే సినిమా నుండి వస్తున్న ప్రచార చిత్రాలు సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాయి. తప్పకుండా సురేందర్ రెడ్డి అఖిల్ తో చేస్తున్న ఏజెంట్ సినిమా అక్కినేని ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. యాక్షన్ సినిమాలకు సురేందర్ రెడ్డికి మంచి పేరు ఉంది. ఇప్పుడు తన పనితనం అంతా కూడా అఖిల్ ఏజెంట్ మీద చూపిస్తున్నాడట సురేందర్ రెడ్డి. అఖిల్ లుక్స్, యాటిట్యూడ్ అన్ని కొత్తగా అదిరిపోయేలా ఉంటాయని చెప్పుకుంటున్నారు.
అఖిల్ ఏజెంట్ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ మూవీ నిర్మిస్తున్నారు. సినిమా తప్పకుండా అక్కినేని అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఇంకా చెప్పాలంటే అంతకుమించి ఉండేలా చేస్తామని అన్నారు నిర్మాత అనీల్ సుంకర. సినిమాతో అఖిల్ ఫుల్ మాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. మరి అఖిల్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అఖిల్ ఏజెంట్ హిట్టు పాడితే అక్కినేని హీరోని ఇక ఎవరు ఆపలేరని చెప్పొచ్చు. ఏజెంట్ తో పాటుగా తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో కూడా ఉన్నాడు అఖిల్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్న ఆ ప్రాజెక్ట్ పై అఫీషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది.