హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2021: 'చై - సామ్' లు చాలా బాధ పెట్టారు...
అందుకే సామ్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారట. ముఖ్యంగా ఇప్పట్లో చై కు ఎదురు పడకూడదని అనుకుంటున్నారట. అటు నాగ చైతన్య కూడా సామ్ కి ఎదురుపడకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారట.
తాజాగా ఈ ఇద్దరు ఒకే చోట ఉన్నట్లు తెలిసింది. నాగ చైతన్య హీరోగా చేస్తున్న 'బంగార్రాజు' అలాగే సమంత చేస్తున్న 'యశోద' షూటింగ్లు ఒకేసారి రామానాయుడు స్టూడియోలో శుక్రవారం జరుగగా ఈ ఇద్దరు ఒకేచోట రామానాయుడు స్టూడియోలో షూటింగ్ కోసం ఉండాల్సి వచ్చింది. అయితే ఒకరికొకరు ఎదురుపడకుండా ముందుగానే అంతా ప్లాన్ చేసుకుని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ అయిపోగానే ఎవరిదారిన వారు వెళ్ళిపోయారట.
కనీసం కలుసుకోలేదని తెలుస్తోంది. కానీ వీరిద్దరూ ఎదురుపడే సందర్భం రావాలని రాజీకి వచ్చి సామ్ తన వైఖరి మార్చుకుని అక్కినేని ఇంటి కోడలిగా చై భార్యగా ..తిరిగి ఈ మాటలను విని రోజులు రావాలని ఇప్పటికీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఇది జరిగింది 2021 వ సంవత్సరంలోనే... వీరిద్దరి అభిమానులు ఎంతగానో ఈ విషయం గురించి బాధపడ్డారు. అయితే మళ్ళీ కలిస్తే చాలా సంతోషంగా ఉంటుందని అంతా అభిప్రాయపడుతున్నారు. మరి అది జరుగుతుందో లేదో తెలియదు కానీ.. వినడానికి మాత్రం చాలా బాగుంది.