అలా జరిగితే ఆచార్య ముందుకు వచ్చే ఛాన్స్!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో ఒక సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తే అది విడుదల అయ్యే అంతవరకు ఆ సినిమా అదే తేదీన విడుదల అవుతుందా లేదా అనే క్లారిటీ ఎవరికీ ఉండటం లేదు. సమాజంలో జరుగుతున్న పలు మార్పులు పలు పరిణామాల వల్ల ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు మేకర్స్. అలా ఇప్పుడు ఇండియా లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రమైన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ జనవరి 7వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నామని చిత్రబృందం ప్రకటించి ఆ తేదీకి తగ్గట్లుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ సినిమాపై క్రేజ్ పెంచే విధంగా ముందుకు దూసుకుపోయింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ చిత్రం విడుదల జరగడం లేదు అని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇదే కనుక నిజమైతే అభిమానులు భారీగా నిరాశ పడతారు అని చెప్పవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు హీరోగా నటించిన ఈ సినిమా పై టాలీవుడ్ మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుంది.

అంతే కాదు దేశ వ్యాప్తంగా మంచి అంచనాలు ఉన్నాయి. అలాంటి సినిమా ఇప్పుడు పోస్ట్ పోన్ అయితే అందరూ నిరాశ పడతారు. అయితే ఇదే నిజమైతే ఈ సినిమా విడుదల రోజున ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు రామ్ చరణ్. ఈ చిత్రానికి ఆయన నిర్మాత కాగా ఓ కీలక పాత్రలో కూడా నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించగా పలు మార్లు విడుదల తేదీ లో మర్పులు జరిగాకా ఫిబ్రవరి 3 న విడుదల ను ఫైనల్ చేసుకుంది. ఇండియా లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆర్ ఆర్ సినిమా పోస్ట్పోన్ అయితే ఆ సినిమా ను తీసుకువచ్చి సంక్రాంతికి క్యాష్ చేసుకోవాలనే రామ్ చరణ్ ఆలోచన ఎంత వరకు కరెక్ట్ అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: