రామ్ చరణ్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ..!!

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తాజాగా నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది జనవరి 7 న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. మరో రెండు వారాల్లోనే ఈ సినిమా విడుదల ఉండటంతో ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాలో  చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు రామ్ చరణ్. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో శంకర్ ను వివాదంలోకి నెట్టిన ఇండియన్ 2 సినిమాకి ఇటీవల లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ 2 సినిమా షూటింగ్ ని ముందు కంప్లీట్ చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ లోపు రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి తో సినిమా పూర్తిచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ తొందరగా పూర్తి చేసి ఆ తర్వాత శంకర్ సినిమాలో జాయిన్ కావాలని చూస్తున్నాడట చరణ్. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. గతంలో ఈమె వరుణ్ తేజ్ కి జోడిగా లోఫర్ సినిమాలో నటించింది. మళ్లీ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత తెలుగులో రామ్ చరణ్ సరసన నటించనుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోయే సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదల కానున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: