అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి డాన్సర్ గా తన కెరియర్ ను మొదలు పెట్టి మలయాళం సూపర్ హిట్ మూవీ ప్రేమమ్ తో వెండితెరకు పరిచయం అయ్యింది, ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు అంద చందాలకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఒకే ఒక్క సినిమాతో మలయాళంలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసింది, అందులో భాగంగా వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇలా ఒకే ఒక్క సినిమాతో తెలుగులో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కూడా తొందరపడి సినిమాలు చేయకుండా తనకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుని ముందుకు వెళుతుంది.
గ్లామర్ పాత్రలకు ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలం కథకు, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుని ముందుకు వెళ్తుంది, ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. కొంతమంది హీరోయిన్లు ఒక సినిమా విజయం సాధిస్తే చాలు వరుసపెట్టి సినిమాల్లో నటిస్తూ కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు, కానీ సాయి పల్లవి మాత్రం కోట్లకు ఏమాత్రం ఆశపడకుండా కేవలం మంచి పాత్రలో నటించాలనే ఉద్దేశం తోనే ముందుకు వెళుతుంది, ప్రస్తుతం సాయి పల్లవి ఏ పాత్ర అయినా చేస్తాను అంటే తెలుగు లోనే బోలెడన్ని ఆఫర్లు వస్తాయి, కాకపోతే ఈ ముద్దుగుమ్మ మాత్రం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే చేస్తూ వస్తోంది. కొన్ని రోజుల క్రితమే సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాతో మెప్పించింది, సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ 24వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. అలాగే రానా హీరోగా తెరకెక్కిన విరాటపర్వం సినిమాల్లోనూ సాయి పల్లవి నటించింది, ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు, ఇలా సాయి పల్లవి కోట్లకు ఆశపడకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది.