థియేటర్స్ మూసివేతతో టెన్షన్ పడిపోతున్న ఆర్ ఆర్ ఆర్ బయ్యర్లు !

Seetha Sailaja

ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ ల రేట్ల రగడ ఇంకా తేలకుండానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని  థియేటర్లలో సాగుతున్న సోదాలు ధియేటర్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడ షాక్ ఇస్తున్నాయి.సినిమా టిక్కెట్లు అధిక ధరలకు విక్రయించినా బ్లాక్ మార్కెట్ చేసినా అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు.


అలాగే థియేటర్లలో తినుబండారాలు కూల్ డ్రింక్స్ తో సహా నిర్ధిష్ఠ ధర దాటితే ఫైన్స్ వేస్తున్నారు. అంతేకాదు అంతేకాదు టాయ్ లెట్ల నిర్వహణలో లోపాలు కనిపిస్తే వెంటనే ధియేటర్లకు సీల్ వేస్తున్నారు. ఈ పరిస్థితులకు అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ లోని ధియేటర్ల యజమానులు ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ఇక ధియేటర్లను నిర్వహించలేమని సంక్రాంతి సీజన్ కు రాబోతున్న భారీ సినిమాల నిర్మాతలను వారి భారీ సినిమాల రిలీజ్ ను వాయిదా వేసుకోవలసిందిగా కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాలచోట్ల ధియేటర్ల ముందు నో షో బోర్డులు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల మధ్య నిన్న హీరో నాని టిక్కెట్ల రేట్ల పెంపు వ్యవహారం పై స్పందిస్తూ థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని టికెట్ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావడమే కాకుండా ఇప్పుడు ఈ కామెంట్స్ తో ఈ టిక్కెట్ల రేట్ల పెంపుదల వివాదం మరింత ముదిరిపోయే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.  


ఈ వివాదం మధ్య కొందరు నాని వెంటనే ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని ట్విస్ట్ ల మధ్య ఈ వ్యవహారం మరింత ముదిరిపోతే సంక్రాంతికి రాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాథే శ్యామ్’ మూవీల బయ్యర్లకు నిర్మాతలకు తిప్పలు తప్పవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని అత్యంత భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లకు ఈపరిణామం తీవ్ర టెన్షన్ ను కలిగిస్తున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: