ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రాధేశ్యామ్ ట్రైలర్..!
ఇక రాధేశ్యామ్ అసలు గుట్టు తెలియాలంటే ట్రైలర్ రావాల్సిందే. ఓ సినిమాను అంచనా వేయాలంటే ట్రైలర్ చాలా ఇంపార్టెంట్ రోల్ పోశిస్తుంది. అందుకే రాధేశ్యామ్ ట్రైలర్ క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయినా సరే వారి వెయిటింగ్ కు తగినట్టుగా అదిరిపోయే సర్ ప్రైజులతో రాధేశ్యామ్ సినిమా వస్తుందని తెలుస్తుంది.
సినిమాలో ప్రభాస్, పూజా హెగ్దేల జోడీ ప్రధాన ఆకర్షణగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ సినిమా కేవలం లవ్ స్టోరీగానే వస్తుందని ఫ్యాన్స్ కొద్దిగా నిరాశపడుతున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా భారీగా ఉంటాయట. ముఖ్యంగా 15 నిమిషాల పాటు సముద్రంలో ఫైట్ సినిమాకే హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రాబోతున్న రాధేశ్యామ్ గురించి ఇప్పటి వరకు ఉన్న బజ్ అయితే ఏమాత్రం సరిపోదని చెప్పాలి. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న రాధేశ్యామ్.. ప్రమోషన్స్ ఊపందుకుంటే కాని ఆడియెన్స్ అంతా ఎక్సయిట్ అయ్యే అవకాశం ఉంటుంది. రాధేశ్యామ్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈరోజు ఫ్యాన్స్ సమక్షంలో జరుగుతుంది. ఆర్ఫెసీలో రాధేశ్యామ్ ఈవెంట్ భాఈ రేంజ్ లో ప్లాన్ చేశారు. అయితే ఈ ఈవెంట్ కు గెస్టులుగా ఎవరు వస్తున్నారు అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.