పుష్ప సాంగ్ పై స్పందించిన సమంత..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన పుష్ప, ఈ సినిమా ను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు, రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మొదటి భాగం పుష్ప ది రైస్ డిసెంబర్ 17 వ తేదీ న థియేటర్ లలో విడుదలయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లలో మంచి కలెక్షన్ లతో ముందుకు దూసుకుపోతుంది, ఈ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపిస్తూ ఉండగా, రష్మిక మందన అతని ప్రేయసి శ్రీ వల్లి పాత్రలో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా లో సమంత ఒక స్పెషల్ సాంగ్ చేసిన విషయం అందరికీ తెలిసింది, ఈ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసినప్పటి నుండి ఈ పాట చుట్టూ అనేక వివాదాలు ఏర్పడ్డాయి, అయితే ఇలా ఎన్నో వివాదాల మధ్య థియేటర్ లలో ఈ పాటను జనాలు వీక్షించారు, థియేటర్ లలో సమంతా స్పెషల్ సాంగు చూసిన వారిలో చాలా మంది ఇది ఈ సాంగ్  అదిరిపోయింది అంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.


 అయితే ఇలా ఎంతో మంది ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొన్న ఈ సాంగ్ పై సమంత తాజా గా స్పందించింది, సమంత ఈ సాంగ్ పై స్పందిస్తూ.. ఊ అంటవా మావ.. ఊఊ అంటావా సాంగ్‌ కి నేను బాగా ఆడాను. నేను ఏది చేసినా దానిలో మెరుగ్గా ఉండటానికి చాలా కష్టపడుతున్నాను, సదా మీ ప్రేమకు ధన్యవాదాలు.? అంటూ సమంత చెప్పుకొచ్చింది. అయితే పుష్ప సినిమా ఐటెం సాంగ్ షూటింగ్‌ లో అల్లు అర్జున్‌ తో స్టెప్పులు, రిథమ్, డ్యాన్స్‌ లకి తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి సమంత వెల్లడించింది, ఈ సాంగ్ లో నటించే అవకాశాన్ని సమంత మొదట తిరస్కరించిందని దర్శకుడు సుకుమార్ తెలిపారు, తరువాత అతను ఆమె ను ఒప్పించాడు, ‘రంగస్థలం’ సినిమాలో పూజా హెగ్డే డ్యాన్స్ ఉదాహరణ గా చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: