తెలుగు మాస్ సినిమాలకు కొందరు డైరెక్టర్లు ప్రత్యేకం..అలాంటి వారిలో లెక్కల మాస్టర్ సుకుమార్ ఒకరు..ఈయన సినిమాలను ఒక లెక్క ప్రకారం చేస్తాడు అలాగే ప్రేక్షకులకు కూడా చూపిస్తాడు. రంగస్థలం సినిమా తో సుక్కు మరో రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.. న్యాచురల్ గా తీసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను షేక్ చేసాడు. ఆ సినిమా హిట్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములాను ఉపయోగించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు..
తాజాగా ఈ డైరెక్టర్ తెరకెక్కించిన మాస్ మసాలా సినిమా పుష్ప.. అల్లు అర్జున్ కథానాయకుడుగా, రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. వీరిద్దరు చాలా కష్టపడి నటించారు. ఇప్పుడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా పైనే ఉంది. సినిమా భారీ సక్సెస్ అయింది. నెక్స్ట్ ఎవరితో చేస్తె మరో హిట్ ను కోడతాడో అని గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా తర్వాత సుకుమార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయాల్సి ఉంది.. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ను కూడా చేశారు. అయితే చివరి నిమిషం లో తన ఆలోచన మార్చు కున్నాడు. అది కాస్త మహేష్ బాబు నుంచి అల్లు అర్జున్ షిఫ్ట్ అయ్యింది. అలా బన్నీ తో పుష్ప సినిమా ను చేసి ఇప్పుడు వరల్డ్ రికార్డ్ ను అందుకున్నాడు.. బన్నీ సెట్ అయిన విధంగా ప్రిన్స్ సెట్ అవ్వ లేదు. ఇప్పుడు ఎలాగైనా మళ్ళీ మహేష్ తో సినిమా చేసే ఆలోచన లో వున్నాడు సుక్కు.. అతనికి సెట్ కథను సిద్దం చెస్తున్నాడు. మరి ఆ సినిమా ఎప్పుడూ సెట్స్ పైకి వెళుతూందో చూడాలి.. ఈ వార్త నిజమైతే మహేష్ అభిమానులకు మాస్ ట్రీట్ పక్కా..