నాగార్జున ఆలోచనలతో మరింత పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

Seetha Sailaja
‘పుష్ప’ హడావిడి పూర్తి అవ్వడంతో ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి అంతా సంక్రాంతి సినిమాల పై పడింది. సంక్రాంతికి వారం రోజులు ముందుగా రాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియాను లెక్క చేయకుండా క్యూ కట్టబోతున్న సంక్రాంతి సినిమాల వల్ల ‘ఆర్ ఆర్ ఆర్’ కలక్షన్స్ దెబ్బతింటాయి అన్నభయం ఆమూవీ నిర్మాతలలో ఏర్పడింది.



దీనితో ఒక్క ‘రాథే శ్యామ్’ తప్ప మరే సినిమా సంక్రాంతి బరిలో లేకుండా చేసుకోవాలని ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాతలతో పాటు ‘ఆర్ ఆర్ ఆర్’ బయ్యర్లు కూడ చాలతీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని భారీ రేట్లకు కొనుక్కున్న దిల్ రాజ్ ఏదోవిధంగా ‘భీమ్లా నాయక్’ మూవీని వాయిదా వేయించాలని చాల గట్టిప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



అయితే ఈ మూవీని సంక్రాంతికి విడుదలచేసి తీరాలి అని పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉండటంతో సంక్రాంతి రేస్ పూర్తిగా కన్ఫ్యూజన్ లో పడిపోయినట్లు తెలుస్తోంది. దిల్ రాజ్ త్రివిక్రమ్ సహాయంతో పవన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ అతడి అపాయింట్ మెంట్ దొరకడంలేదు అంటున్నారు. దీనితో ‘భీమ్లా నాయక్' సంక్రాంతి రేస్ కు రావడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనితో మూడు భారీ సినిమాలకు ధియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అన్న సందేహాలలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి.



ఈవిషయాలను పట్టించు కోకుండా ఇప్పుడు నాగార్జున కూడ తన లేటెస్ట్ మూవే ‘బంగార్రాజు’ సంక్రాంతి రేస్ కు రాబోతోంది అన్న సంకేతాలు ఇవ్వడమే కాకుండా ఈ మూవీ ప్రమోషన్ ను మొదలు పెట్టి వరసపెట్టి ఈమూవీలోని పాటలను వరసపెట్టి రిలీజ్ చేయడంతో అసలు నాగార్జున సినిమాకు కనీసపు ధియేటర్లు అయినా దొరుకుతాయ అన్న సందేహంలో అందరు ఉన్నారు. అంతేకాదు ఇన్ని సినిమాల మధ్య ఏధైర్యంతో నాగ్ ముందడుగు వేస్తున్నాడు అంటూ నాగ్ ఆలోచనలతో సంక్రాంతికి అసలు ఏసినిమాలు ఫైనల్ గా వస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆలోచనలలో పడిపోతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: