అయ్యో..పుష్పకు మరో కష్టం వచ్చిందిగా..!
సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే 'పుష్ప' పైరసీ అయినట్లు తెలుస్తోందట.. ఈ మధ్యకాలంలో పైరసీని అరికట్టడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారట.చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు ఈ పైరసీ బెడద తప్పడం లేదట.
ఇప్పటివరకు వేల సినిమాలు పైరసీ పాలయ్యాయని. 'బాహుబలి' లాంటి పాన్ ఇండియా సినిమాలు కూడా పైరసీ బారిన పడ్డాయట.తాజాగా 'పుష్ప' సినిమాను కూడా పైరసీ చేసేసారని తెలుస్తుంది.. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఫుల్ హెచ్ డి లింక్ ను ఆన్‌లైన్‌లో పెట్టేశారట.ఎన్నో ఏళ్లుగా పైరసీను ప్రోత్సహిస్తోన్న తమిళ రాకర్స్ మరియు మూవీ రూల్స్ వంటి సంస్థలు చాలా సినిమాలను ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నాయట.. ఇప్పుడు సినిమాను కూడా లీక్ చేసేశాయని సమాచారం.
దీంతో భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందనుకుంటున్న చిత్రనిర్మాతలు ఆందోళన పడుతున్నారట.ఇప్పటికే 'పుష్ప' సినిమాకి మిశ్రమ స్పందన వస్తుందని బ్లాక్ బస్టర్ అనుకున్న ఈ సినిమాపై కొందరు కావాలనే యావరేజ్ అనే ప్రచారం చేస్తున్నారట.ఈ క్రమంలో సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం 'పుష్ప' సినిమాకి కలెక్షన్స్ పరంగా దెబ్బపడినట్లే అని తెలుస్తుంది.మరి దీనిపై చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. ఇక రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ లో నటించిందని అందరికి తెలుసు .
ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించారట. సెకండ్ పార్ట్ లో ఫహద్ రోల్ ఎక్కువ ఉంటుందని తెలుస్తోందని సమాచారం.దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారట మేకర్స్..