వామ్మో: పుష్పలో ఐటెం సాంగ్‌కు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..??
ఇక ఈ సినిమా నుండి విడుదలైన ఈ పాట కొద్ది రోజుల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్‌తో దక్కించుకుంది. ఇక ఈ చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్ చేయడంతో మరింత అంచనా పెంచేసింది. ఈ పాటను ప్రముఖ గాయని మంగ్లీ చెల్లి పాడారు. అంతేకాదు.. 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' అనే సాంగ్‌కి సమంత చేసిన డాన్స్ ఉర్రూత లూగిస్తోందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సాంగ్ కోసం మైత్రి మూవీ మేకర్స్ దాదాపు రూ.5 కోట్ల ఖర్చుపెట్టారని సమాచారం. అంతేకాదు.. ఈ పాట కోసం సమంతకు ఏకంగా కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టారని సమాచారం.
అంతేకాదు.. భారీ సెట్టింగ్‌తో విజువల్ వండర్‌గా చిత్రీకరించారని తెలిపారు. ఈ చిత్రంలో సాంగ్ పుష్ప మూవీకి హైలెట్‌గా అవుతుందని చిత్రబృందం భావించారు. ఈ పాట ఇప్పటికే 45 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో ట్రెండ్ సృష్టించింది. ఈ పాటకు 1.6మిలియన్స్‌కి పైగా లైక్స్ వచ్చినట్లు సమాచారం. అందుకే థియేటర్స్‌లో ఈ సాంగ్ మరింత సందడి చేస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఈ పాటలో సమంత గ్లామర్, చంద్రబోస్ లిరిక్స్ ఒక ఎత్తైతే, గాయని ఇంద్రావతి చౌహాన్ మత్తైన గాత్రం మరో ఎత్తు. మొత్తం మీద ఈ సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవ్వడంతో చిత్రబృందం ఖుషీ అవుతున్నారు.