మొదలుపెట్టింది మనమే కానీ వారిదే హవా!!
ఇప్పుడు తమిళ సినిమా పరిశ్రమ కూడా పాన్ ఇండియా సినిమాలను చేయడంపై భారీగా దృష్టి పెట్టింది. ఇప్పటికే పెద్ద హీరోలు అందరూ కూడా ఈ సినిమాలు చేసి తమదైన ముద్ర చూపించే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని తమిళ మీడియా వర్గాలు చెప్పేది ఏమిటంటే తమిళ అగ్ర హీరోలైనా విజయ్ సూర్య అలాగే ధనుష్ వంటి హీరోలు దేశం మొత్తం ఇంపాక్ట్ ఉండేలా సినిమాలను చేయాలని వారు భావిస్తున్నారని తెలుస్తోంది.
ఏదేమైనా పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించడంలో తెలుగు సినిమా పరిశ్రమ విఫలం అవుతుందనే చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత అంతటి స్థాయిలో ప్రేక్షకులను అలరించిన సినిమా ఇంతవరకు రానేలేదు. భవిష్యత్తులో మన సినిమాలు దేశం మొత్తం ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందా అనేది చూడాలి. మరి సౌత్ సినిమా పరిశ్రమలో తమిళ సినిమా పరిశ్రమ సినిమాల విషయంగా మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేయగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా తమ పనితనంతో మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది చూడాలి. ఇక తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇవి ఎంతాగా ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి.