ఆ విషయంలో కేరళ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన పుష్ప..!

murali krishna
అల్లు అర్జున్ మరియు సుకుమార్‌ల నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ పుష్ప అని అందరికి తెలుసు.. తెలుగుతో పాటు హిందీ మరియు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారట.
ఈ సినిమాకు తెలుగు తర్వాత ఎక్కువ క్రేజ్ ఉన్నది మలయాళంలోనే అని సమాచారం.కేరళలో చాలా ఏళ్ల నుంచి బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉండటం… గత కొన్నేళ్లలో అది ఇంకా పెరగడం 'పుష్ప'కు బాగా ప్లస్ అయ్యిందట.గతంలో బన్నీ సినిమాలు తెలుగులో రిలీజయ్యాక కొన్నాళ్లకు మలయాళంలో అనువాదం అయి రిలీజయ్యేవట. కానీ 'పుష్ప'ను తెలుగుతో పాటే మలయాళంలోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరిగాయట.. చాలా జాగ్రత్తగా డబ్బింగ్ వర్క్ కూడా చేశారట.. బన్నీ కేరళకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేశాడు కూడా. అక్కడ ఈ సినిమాను పెద్ద హీరోల స్ట్రెయిట్ మూవీ స్థాయిలో విడుదలకు సిద్ధం చేశారట.
ఇప్పుడు పెద్ద షాక్ తగిలిందని తెలుస్తుంది.. 'పుష్ప' మలయాళ వెర్షన్ శుక్రవారం విడుదల కావట్లేదట.. ఒక రోజు ఆలస్యంగా శనివారం సినిమా రిలీజవుతుందని తెలుస్తుంది ఈ సినిమా ఫైనల్ కాపీని సరైన సమయానికి డెలివర్ చేయడంలో చిత్ర బృందం విఫలమైందట.తెలుగులో కాస్త ముందే సెన్సార్ చేయించి తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేశారట  వాటికి కూడా సెన్సార్ బోర్డు నుంచి ఆమోదం తెచ్చుకున్నారట.. కానీ సుకుమార్ ముంబయిలో కూర్చుని విడుదలకు రెండు రోజుల ముందు కూడా మార్పులు చేర్పులు చేయడం ఆ కంటెంట్ కేరళకు ఆలస్యంగా అందడం  దానికి డబ్బింగ్ పూర్తి చేసి  సెన్సార్ పూర్తి చేయించడంలో ఆలస్యం జరగడంతో శుక్రవారం షోలన్నీ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందట.ఇంత హైప్ ఉన్న సినిమాకు తొలి రోజు షోలు పడకపోవడంతో కేరళ బన్నీ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని తెలుస్తుంది..శనివారం అయిన ఈ సినిమా విడుదలవుతుందో లేదో మరి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: