పుష్పలో ఆ పాటలకు క్రేజీ రెస్పాన్స్..! అలాంటి సాంగ్స్ కే పట్టాభిషేకం..!

NAGARJUNA NAKKA
సుకుమార్, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చింది 'పుష్ప'. ఫస్ట్‌లుక్, టీజర్స్‌తోనే మంచి బజ్‌ క్రియేట్ చేసుకున్న ఈ మూవీతో ఒక ఫోక్‌ సింగర్స్‌ ని సినిమాలకి పరిచయం చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఈ మూవీలో ఐటెమ్‌ సాంగ్‌ని జానపద గాయని ఇంద్రావతితో పాడించాడు దేవి. ఫోక్‌ సాంగ్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైన మౌనిక్‌ యాదవ్‌తో కూడా ఒక పాట పాడించాడు దేవిశ్రీ ప్రసాద్. 'పుష్ప' సినిమాలో సామి సామి పాటని మౌనిక యాదవ్‌తో పాడించాడు. ఫోక్‌ స్టైల్‌లో ఉన్న ఈ పాటకి ఆడియన్స్‌ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. 'రంగస్థలం' సినిమాతోనూ ఫోక్‌ సింగర్స్‌ని ప్లేబ్యాక్ సింగర్స్‌గా మార్చాడు దేవిశ్రీ ప్రసాద్. ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న గంటల వెంకటలక్ష్మితో 'జిగేలు రాణి' పాట పాడించాడు దేవి శ్రీ ప్రసాద్. రేలా కుమార్‌తో కలిసి విజయలక్ష్మి పాడిన ఈ పాట సూపర్ హిట్‌ అయ్యింది.

మరోవైపు పవన్ కళ్యాణ్ మళయాళీ హిట్‌ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌ చేస్తున్నాడు అనగానే ఒరిజినల్‌ సోల్‌ని ఎలా క్యారీ చేస్తారని చాలామందికి డౌట్స్‌ వచ్చాయి. అయితే 'భీమ్లానాయక్' టీమ్‌ మాత్రం 'ఎకె' రూట్‌లోనే వెళ్తోంది. 'భీమ్లానాయక్' టీజర్‌లోనే మళయాళీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ని వినిపించాడు తమన్. అలాగే ఇప్పుడు సాంగ్స్‌లోనే అయ్యప్పన్‌నే ఫాలో అవుతున్నాడు భీమ్లానాయక్. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాతో గ్రామీణ మహిళ నంజమ్మని ప్లేబ్యాక్‌ సింగర్‌గా మార్చాడు సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్. ఇక ఈ మూవీ రీమేక్‌గా వస్తోన్న 'భీమ్లానాయక్'తో ఇద్దరు జానపద గాయకులని ప్లేబ్యాక్‌ సింగర్స్‌గా మార్చాడు.

'భీమ్లానాయక్' టైటిల్ సాంగ్‌లో కొంత భాగాన్ని కిన్నెర మొగిలయ్యతో పాడించాడు. ఈ సాంగ్‌ సూపర్ హిట్‌ అయ్యింది. ఇక ఇప్పుడు అడవితల్లి పాటని గ్రామీణ మహిళ  దుర్గవ్వతో పాడించాడు తమన్. తమన్ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఆల్బమ్ 'అల వైకుంఠపురములో'. తమన్‌ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లిన ఈ ఆల్బమ్‌తో ఒక జానపద గాయకుడిని ప్లేబ్యాక్‌ సింగర్‌గా మారాడు. ఉత్తరాంధ్ర గాయకుడు సూరన్నతో సిత్తరాల సిరపడు పాట పాడించాడు తమన్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: