పుష్ప : 50 కోట్ల ఫస్ట్ డే టార్గెట్ తో పుష్ప..!

shami
ఇప్పుడు నేషనల్ వైడ్ ఎక్కడ చూసినా పుష్ప పుష్ప అంటూ హడావిడి చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ కి సందడి తెచ్చేలా పుష్ప సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా రిలీజ్ గా వస్తున్న పుష్ప సినిమా ఫస్ట్ డే టార్గెట్ భారీగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ డే నే 50 కోట్లు కొల్లగొట్టి వీకెండ్ వరకు అటు ఇటుగా 120 కోట్ల వరకు రాబట్టాలని పుష్ప ప్లాన్.
నైజాం లో ఈ సినిమాకు ఐదు షోలకు పర్మిషన్ దొరికింది. సో నైజాం లో బన్నీ ఫాలోయింగ్ కి ఇక్కడ భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ముదులిపేస్తున్నారు ప్రేక్షకులు. ఇలా పెట్టడమే ఆలస్యం అలా ఖాళీ అయిపోతున్నాయి. ఈ లెక్కన పుష్ప ఫస్ట్ డే 50 కోట్లు చాలా ఈజీ అని చెప్పొచ్చు. అంతేకాదు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ సరికొత్త రికార్డులు సృష్టిస్తాడని తెలుస్తుంది.
సినిమాపై భారీ అంచనాలు రావడం. పాన్ ఇండియా లెవల్ లో మరో సినిమా పోటీ లేకపోవడం కూడా పుష్పకి కలిసి వచ్చే అంశమే. కెరియర్ లో ఫస్ట్ టైం నేషనల్ లెవల్ అటెంప్ట్ చేస్తున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్ లో అతని మాట్లాడిన తీరు కూడా సినిమాపై అతనికి ఉన్న కాన్ఫిడెన్స్ ను తెలియచేస్తుంది. సుకుమార్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించినట్టు చెప్పుకుంటున్నారు. మరి ఇన్ని అంచనాలు ఉన్న పుష్ప ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు నేషనల్ వైడ్ గా పుష్ప బజ్ ఓ రేంజ్ లో ఉంది. ఈ బజ్ చూస్తుంటే తప్పకుండా పుష్ప అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: