సమంత సినిమాలో ఆ ముద్దు గుమ్మ కూడా..!

Pulgam Srinivas
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఇందులో భాగంగా సమంత ప్రస్తుతం యశోద అనే సినిమాలో నటిస్తోంది, ఈ సినిమాలో సమంత ముఖ్య పాత్ర లో కనిపించబోతోంది. ఈ మూవీ ని శ్రీదేవి మూవీ స్‌ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 14 గా శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హరి – హరీష్… ఇద్దరు యువకులు ఈ మూవీ తో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమా లతో చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తాజా గా ఇందు లో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర లో నటించనున్నారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. “సమంత ప్రధాన పాత్ర లో మేం నిర్మిస్తున్న బహు భాషా చిత్రం ‘యశోద’ చిత్రీకరణ ఈ నెల 6 వ తేదీ న ప్రారంభం అయ్యింది.


అప్పటి నుండి నిర్విరామం గా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీ లో కీలకమైన మధుబాల పాత్ర లో వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్ కనిపిస్తారు. ఈ రోజు నుంచి ఆమె సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ప్రధాన తారాగణం పై ఈ నెల 23 వ తేదీ వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చేస్తాం. జనవరి 3 నుంచి రెండో షెడ్యూల్ మొదలవుతుంది. నిర్విరామం గా చిత్రీకరణ చేసి… మార్చి కి ఈ మూవీ ని పూర్తి చేస్తాం, థ్రిల్లర్ జాన‌ర్‌లో నేషనల్ లెవ‌ల్‌ లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న సినిమా ఇది అని చెప్పారు. సమంత ఈ సినిమా తో పాటు శాకుంతలం సినిమా లో కూడా ప్రధాన పాత్ర లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: