వావ్.. నాని సూపర్ కాన్ఫిడెన్స్..!

shami
నాచురల్ స్టార్ నాని రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. నాని నటించిన అన్ని సినిమాలకు ఈ సినిమాకు చాలా డిఫరెన్స్ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా నాని కెరియర్ లో ఇప్పటివరకు హయ్యెస్ట్ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. డిసెంబర్ 24న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. సినిమాలో నాని డ్యుయల్ రోల్ లో నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అనిపిస్తుంది.
సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో నాని స్పీచ్ హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ క్రిస్ మస్ మనదే అంటూ నాని అనడం సినిమాపై అతను ఎంత నమ్మకంగా ఉన్నాడు అన్నది తెలుస్తుంది. సినిమాలో నాని తన నట విశ్వరూపం చూపించాడని అంటున్నారు. ఓ పక్క వాసు పాత్రలో మోడ్రెన్ లుక్ తో అదరగొట్టగా శ్యామ్ సింగ రాయ్ పాత్రలో మరో నానిని చూపించబోతున్నాడు. ఈ సినిమా డైరక్టర్ రాహుల్ సంకృత్యన్ ఓ కొత్త కథతో శ్యామ్ సింగ రాయ్ తీశాడని తెలుస్తుంది.
ట్యాక్సీవాలా సినిమాతో మొదటి సినిమాతోనే తన ప్రతిభ చాటిన రాహుల్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాతో నెక్స్ట్ లెవల్ కు వెళ్లబోతున్నాడని చెప్పొచ్చు. నాని కూడా చివరగా వచ్చిన రెండు సినిమాలు V, టక్ జగదీష్ నిరాశపరచాయి. అందుకే ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. నాచురల్ స్టార్ నాని కూడా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడని శ్యామ్ సింగ రాయ్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమా తర్వాత నాని వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: