రాజమౌళి కొత్త కోరిక.. ఇలా అయితే కష్టం!!

P.Nishanth Kumar
దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమాను ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడో అందరూ చూస్తూనే ఉన్నాం. సినిమాలు తెరకెక్కించడంలో తనదైన స్టైల్ చూపించే రాజమౌళి ప్రమోషన్ చేసే విషయంలో కూడా అదే విధమైన మార్క్ చూపిస్తూ సినిమాను ప్రేక్షకులందరికీ దగ్గర చేయడంలో సక్సెస్ అవుతూ ఉంటాడు. అందుకే రాజమౌళి సినిమాలకు ఎక్కువగా ప్రేక్షకులు వస్తూ ఉంటారు. సినిమా ప్రేక్షకులను చేరవేయడంలో కూడా రాజమౌళి తనదైన స్టైల్ చూపిస్తాడు కనుకనే ఆయనకు పరాజయాలు లేవని చెప్పవచ్చు.

ఆ విధంగా బాహుబలి సినిమాను తెరకెక్కించిన జక్కన్న అప్పుడు ఆ సినిమాలో భారతదేశంలోని ప్రతి ఒక్క ప్రేక్షకులకు కూడా దగ్గర చేయడంలో రాజమౌళి పడిన కష్టం అంతా ఇంతా కాదు. తొలిసారిగా పాన్ ఇండియా సినిమా టాలీవుడ్ నుంచి రాబోతుంది. గతంలో ఏ సినిమా పరిశ్రమ చేయని విధంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించి విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు రాజమౌళి. కానీ అప్పుడు ఒక్కడే దేశమంతటా ఈ సినిమాను చూసేలా ప్రమోషన్ కార్యక్రమాలు చేసి ఈ చిత్రం అఖండ విజయం దక్కేలా చేసుకున్నాడు.

ఇప్పుడు ఆ సినిమా తర్వాత చాలా చిత్రాలు సినిమాలు వెలిసాయి. దాంతో పాటు రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా ఈ చిత్రానికి సైతం బాహుబలి కి మించిన ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఆయన మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా అయితే ప్రకటన రాలేదు కానీ ఒకటి రెండుసార్లు రాజమౌళి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఆయన రజినీకాంత్ సినిమా చేయాలనే కోరికను బయటపెట్టాడు. అందరూ ఈ నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. మంచి కథ దొరికితే సినిమా చేయడానికి సిద్ధం అని చెప్పాడు. మరి ఆ సినిమా ఎంత వరకు సెట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: