బిగ్ బ్రేకింగ్: రాధే శ్యామ్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు, ఆ స్టార్ డమ్ ను కాపాడుకునే ఉద్దేశంతో ప్రభాస్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్ నటించిన సినిమా రాదే శ్యామ్, ఈ సినిమా కు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడం తో ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది, ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను, టీజర్, పాటలను చిత్ర బృందం విడుదల వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలను పెంచాయి.


రాదే శ్యామ్ చిత్ర బృందం తాజా గా మరో అప్డేట్ ను తెలియజేసింది, రాదే శ్యామ్ సినిమా నుండి సంచారి అనే సాంగ్ టీజర్ ను ఈ రోజు ఒంటి గంటకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు జనాలను ఎంతగానో అలరించడం తో ఈ సాంగ్ కోసం కూడా ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు జనం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ సినిమా తో పాటు సలార్, ఆది పురుష్,  ప్రాజెక్ట్ కే సినిమాల్లో నటిస్తున్నాడు, వీటి తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో  స్పిరిట్ అనే మూవీ లో నటించడానికి ఇప్పటికే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: