ఆర్ఆర్ఆర్ : చూసింది గోరంతే ... చూడాల్సింది కొండంత ...??

GVK Writings
దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తీస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ ఇందులో కొమరం భీంగా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా చేస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కేకే సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ ఎత్తున తీస్తుండగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా పై ఎన్టీఆర్, చరణ్ ల ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్స్ ,సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా సినిమాపై భారీ ఎత్తున అంచనాలు క్రియేట్ చేసాయి అనే చెప్పాలి. ఎన్టీఆర్, చరణ్ లతో పాటు సినిమాలోని ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రేక్షకాభిమానులు మనసు తాకుతుందని, అంత గొప్ప ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించామని, అయితే రేపు రిలీజ్ తరువాత ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అందుకుంటుంది అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారని అంటున్నారు రాజమౌళి.
ఇక ఈ సినిమా ట్రైలర్ కి అన్ని భాషల ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి కూడా సూపర్ గా రెస్పాన్స్ వస్తుండడంతో యూనిట్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ లో పలు రికార్డులు నమోదు చేసింది ఆర్ఆర్ఆర్ టీజర్. అయితే ట్రైలర్ లో చూసింది కేవలం గోరంత మాత్రమే అని, సినిమాలో కొండంత ఆసక్తికరకమైన ఎన్నో భారీ యక్షన్, ఎమోషనల్, ఫైట్స్ వంటి అంశాలు దాచి ఉంచారని, తప్పకుండా అవి అందరినీ ఆకట్టుకుని సినిమా పెద్ద సక్సెస్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: