సూర్యకు తెలుగులో బంపర్ ఆఫర్...?
సూర్య హీరోగా సినిమాను తెరకెక్కించడానికి ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి సిద్ధమయ్యారని దీనికి సంబంధించిన కథ కూడా రెడీ చేస్తున్నారు అని ఒక హిందీ రీమేక్ సినిమాలు తెలుగులో సూర్య హీరోగా రీమేక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన తో పాటుగా ఒక పోస్టర్ కూడా విడుదల చేసే అవకాశం ఉండవచ్చని టాలీవుడ్ జనాల మాట. ఈ సినిమాకు నిర్మాత అల్లు అరవింద్ వ్యవహరిస్తారని అలాగే తమిళ నిర్మాత కూడా ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహించే అవకాశాలు ఉండవచ్చు అని సినిమా వర్గాలు అంటున్నాయి.
సూర్యా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెలుగులో ఒక సినిమా చేసేందుకు గతంలో ప్రయత్నాలు చేసినా సరే అవి ఫలించకపోవడంతో ఆయన వెనక్కు తగ్గారు. అయితే ఇప్పుడు సురేందర్‌రెడ్డి సూర్య హీరోగా సినిమాను తెరకెక్కించడానికి రెడీ కావడంతో కాస్త ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనే దానికి సంబంధించి క్లారిటీ లేకపోయినా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి సూర్య సోషల్ మీడియాలో ప్రకటన చేయవచ్చని సమాచారం.దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.