ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సౌత్ హీరోయిన్లు బాలీవుడ్లో నటించాలని తహతహలాడే వారు. ఎందుకంటే దేశంలోని అతి పెద్ద పరిశ్రమ బాలీవుడ్ పరిశ్రమ. అక్కడ కనుక సినిమా చేస్తే మంచి గుర్తింపుతో పాటు డబ్బు కూడా వస్తుందని హీరోయిన్స్ బాలీవుడ్లో నటించాలని అనుకునేవారు. అయితే ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఆ సీన్ కాస్త రివర్సయింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్లందరూ ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానికి కారణం ఇప్పుడు టాలీవుడ్ సినిమాల మార్కెట్ పెరగడం.ఇక్కడ కూడా పెద్ద సినిమాలు నిర్మాణం అవ్వడం. మరో వైపు టాలీవుడ్ స్టార్ హీరోల క్రేజ్ కూడా ఇందుకు ఓ కారణం అని చెప్పవచ్చు.
ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకొనే, ఆలియాభట్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కియారా అద్వానీ వంటి వారు ఇప్పటికే తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నాగ్, అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ వరల్డ్ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తోంది. ఇక మరోవైపు దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ హీరోయిన్ ఇదివరకే తెలుగులో రామ్ చరణ్, మహేష్ బాబు వంటి హీరోలతో సినిమాలు చేసింది. ఇక వీళ్లతో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా.. క్రిష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న హరిహర వీరమల్ల సినిమా లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లేదా ఆలియా భట్ లలో ఒకరు ఎన్టీఆర్ కి జోడి గా నటించే అవకాశం ఉంది. ఇలా బాలీవుడ్ అగ్ర హీరోలు అందరూ ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయడానికి విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు...!!