పెళ్ళి సందడి రైట్స్ ను 100 కోట్లకు బిజినెస్ చేసిన కత్రీనా కైఫ్ !
ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో జరిగిన అత్యంత ఖరీదైన విలాసవంతమైన పెళ్ళిగా కత్రీనా విక్కీ కౌశల్ ల పెళ్ళి రికార్డులను క్రియేట్ చేస్తోంది. రాజస్థాన్ లోని అత్యంత విలాసవంతమైన ఒక ఫోర్ట్ లో ఈ పెళ్ళి హంగామా నిన్నటి నుంచి మొదలై 9వ తారీఖు వరకు ఈ హంగామా జరగబోతోంది. డెస్టినేషన్ మ్యారేజ్ గా జరుగుతున్న ఈ మ్యారేజ్ కి కేవలం మూడు వందల మంది అతిధులను మాత్రమే పిలిచారు.
అయితే వివాహానికి వచ్చే వారంతా రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపెట్టడమే కాకుండా విధిగా పెళ్ళి తంతు జరుగుతున్న మూడు రోజులు విధిగా మాస్క్ లు ధరించి ఉండాలని కత్రీనా కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈవివాహానికి వచ్చే అతిధులకు 50 వేలు విలువచేసే బంగారంతో పాటు వారంతా బస చేయడానికి అత్యంత విలాసవంతమైన హోటల్ రూమ్స్ ను ఇవ్వడమే కాకుండా కేవలం ఆ హోటల్ రూమ్ టరీఫ్ రోజుకు 80వేలు అని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.
అయితే ఈ పెళ్ళికి వచ్చిన అతిధులు ఎవరు తమ పెళ్ళి తంతును తమ సెల్స్ తో ఫోటోలు తీయకూడదని కత్రీనా కండిషన్స్ పెట్టినట్లు టాక్. అంతేకాదు ఆమె తన పెళ్ళి తంతు జరిగిన మూడు రోజుల కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి ఒక ప్రముఖ ఓటీటీ సంస్థకు 100 కోట్ల పారితోషికానికి అమ్మినట్లుగా బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలు చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది..