'అఖండ' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Anilkumar
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2వ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా సినిమాలో అఘోర పాత్రలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించాడు. దీంతో మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.

ఇక సినిమాలో బాలయ్య అఖండ పాత్రకి బోయపాటి ఇచ్చిన ఎలివేషన్స్,థమన్ కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక అఖండ విడుదలై దాదాపు ఐదు రోజులు కావస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 80 కోట్ల షేర్ వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు తక్కువ ఉన్న నేపథ్యంలో ఈ రేంజ్ కలెక్షన్స్ ను అఖండ సినిమా సాధించింది అంటే అది మామూలు విషయం కాదు. ఇక అఖండ సినిమా వల్ల టికెట్ రేట్ల సమస్య గురించి భయపడకుండా మిగతా పెద్ద సినిమాలు కూడా రంగంలోకి దిగడానికి సిద్దమవుతున్నాయి.

ఇక అఖండ సినిమాతో బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ఇక ఇదిలా ఉండగా అఖండ సినిమా డిజిటల్ రిలీజ్ ఎప్పుడా అనే ఆసక్తి కూడా ఇప్పుడు అందరిలో పెరిగిపోయింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ చేసుకోవాలనేది అగ్రిమెంట్ అని తెలుస్తుంది. మరి దాని ప్రకారం చూసుకుంటే ఈ సినిమా జనవరి 1 లేదా 2 తేదీలలో ఓటీటీ లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అఖండ స్ట్రీమింగ్ కానుంది. ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ డిసెంబర్ ఎండింగ్ లో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం థియేటర్లో రికార్డులు బద్దలుకొడుతున్న ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: