హైప్ క్రియేట్ చేశారు... బోల్తా పడ్డారు.
టివి ప్రేక్షకులకు యాంకర్ గా పరిచయమైన వ్యక్తి మాచిరాజు ప్రదీప్. యాంకర్ గా మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి. దీనిని ఎవరూ కాదనలేరు. అడపాదడపా వెండి తెరపై చిన్నా,చితకా వేషాలు కూడా వేశారు. అవి అంతగా అలరించ లేదు. ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకుల మైండ్ లో రిజిస్టర్ కాలేదు. సినీ రంగం లోనూ ఒక స్థానం సంపాదించుకోవాలనే ఆశలకు కళ్లేం పడింది. 2021లో విడుదల అయిన 30రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా లో ఆయన హీరో వేషం వేశారు. ఈ సినిమా విడుదలకు ఏడాది ముందు నుంచే విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా ప్రదీప్ నటించారని, మీరు ఇంతవరకూ చూడని రీతిలో ప్రదీప్ ను చూస్కారని, డిఫరెంట్ లుక్స్ లో కనిపించి కనువిందు, వీనుల విందు చేస్తారని.. ఇలా చాలా విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. దాదాపు సంవత్సరం పైగా ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. కారణాలు అనేకం. సినీ ప్రేక్షకులకు చెప్పేది మాత్రం కోరనా ప్రభావం.
ఈచిత్రం ఎట్ట కేలకూ 2021 జనవరి 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆకాశానికి దూసుకెళుతుందనుకున్న తారాజువ్వ తుస్సుమని నేలమీదనే నిలిచి పోయిన చందానా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. తెలుగులో పునర్జన్మ ఇతివృత్తంగా విడుదలైన కథలు చాలా వరకూ విజవంతం అయ్యాయి. ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు దర్శకులు మున్నా. అయితే కథ,కథనాలుప్రేక్షకులను అలరించ లేకపోయాయి. హీరో ,హీరోయిన్లమధ్. ప్రేమ సన్నివేశాలు కూడా ప్రేక్షకులు ఆశించినంతగా లేవు. వారి ఆకాంక్షలకు తగ్గట్టు చిత్రీకరణలేదు. స్టేజీ షోల పై యాంర్ గా అందరినీ అలరించిన ప్రదీప్ ఈ సినిమాలో ఓ కాలేజి స్టూడెంట్ పాత్ర లో నటించారు. అప్పటికే సినియర్ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమై ఉన్న ప్రదీప్ ను ఓ కాలేజీ స్టూడేెంట్ గా చూసేందుకు ప్రేక్షకులు అంతగా సుముఖత చూప లేదు. తన నటనలో తనదైన హాస్యాన్ని చొప్పించినా ఈ చిత్రం బాస్కాఫీసు వద్ద బోల్తో కొట్టింది. అయితే అనూప్ రూబెన్స్ సంగీతం మాత్రం అలరించింది.