అఖండ విజయంతో రాజమౌళి ప్రశ్నలకు సమాధానాలు !

Seetha Sailaja
సాధారణంగా శుక్రువారం వస్తే చాలు ఈమధ్య కాలంలో ఓటీటీ లలో ఏసినిమాలు స్ట్రీమ్ కాబోతున్నాయి అంటూ విపరీతంగా యూత్ సెర్చ్ చేసేవారు. అయితే ఈవారం విడుదలవుతున్న ఓటీటీ సినిమాల గురించి కాకుండా జనం ఒక మాస్ సినిమా గురించి మాట్లాడుకోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘అఖండ’ విడుదలకు ముందు హైక్ ఉన్నప్పటికీ ఆసినిమాకు ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు కూడ అంచనా వేయలేకపోయాయి అని అంటున్నారు.

ముఖ్యంగా ఈతరం ప్రేక్షకులు సినిమా నిడివి ఎక్కువ ఉంటే విపరీతంగా అసహనానికి లోనవుతున్నారు. దీనితో చాలామంది దర్శకులు తమ సినిమాల నిడివిని రెండు గంటల ఇరవై నిముషాలలోపే ముగిస్తున్నారు. అయితే ‘అఖండ’ నిడివి రెండు గంటల 45 నిముషాలు దాటిపోయినా ఆవిషయాన్ని పట్టించుకోకుండా బాలకృష్ణ డైలాగుల మ్యానియాలో పడిపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పుడు ఇదే విషయం ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో రాజమౌళి టెన్షన్ కు పరిష్కారాన్ని చూపెడుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ నిడివి సుమారు మూడు గంటలు ఉంటుంది అంటున్నారు. ఇంత నిడివి ఉన్న సినిమాను నేటితరం ప్రేక్షకులు చూడరు అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ నిడివిని కనీసం 15 నిముషాలు తగ్గించమని ఇప్పటికే రాజమౌళి పై ఒత్తిడి వస్తున్నట్లు టాక్. ఈ విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్న రాజమౌళికి ‘అఖండ’ ఘనవిజయం కొండంత ధైర్యాన్ని ఇచ్చింది అంటున్నారు.

ఈమూవీ నిడివి ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులు పట్టించుకోకపోవడంతో అదే సీన్ ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో కూడ రిపీట్ అవుతుంది అంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ తరువాత పెద్ద హీరోలు అందరూ తమ సినిమాలను విడుదల చేయడానికే భయపడిపోతు ఉంటే ఎలాంటి భయాలు లేకుండా ‘అఖండ’ ను విడుదల చేయడమే కాకుండా ఆసినిమా ఘన విజయంతో బాలయ్య ఇండస్ట్రీ వర్గాలకు ధైర్యం కల్గించాడు అంటు ప్రశంసలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: