నందమూరి బాలకృష్ణ కు సింహా మరియు లెజెంట్ సినిమా తర్వాత మరో విజయాన్ని బోయపాటి అందించాడని తెలుస్తుంది.. బాలయ్య తో తన దర్శకత్వంలో బోయపాటి హ్యాట్రిక్ కొట్టాడని తెలుస్తుంది.
అద్బుతమైన విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లుగా అనిపించాడట.గత సినిమా వినయ విధేయ రామ సినిమా మరీ దారుణమైన ప్లాప్ గా మిలిగిందట.. ఆ సినిమా తర్వాత బోయపాటి తో సినిమా ను చేసేందుకు ఎవరు ముందుకు వస్తారని అనుకుంటున్న సమయంలో బాలయ్య వచ్చి తాను బోయపాటిని నమ్ముతున్నట్లుగా చెప్పాడట.బోయపాటి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ చాలా కష్టపడ్డాడట.సోషల్ మీడియాలో బోయపాటి శ్రీను పలు సందర్బాల్లో స్పందిస్తూ తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని చెప్పేవాడట.. కాని ఆ సమయంలో ఆయనకు దారుణమైన ట్రోల్స్ వచ్చేవని బాలకృష్ణ మరియు బోయపాటిల కాంబో అంటే ఓ రేంజ్ లో ఉంటుందని అంటూ మరో సారి నిరూపితం అయ్యిందట.
బాలకృష్ణ అఖండ సినిమా లో కనిపించిన తీరు చూస్తుంటే అభిమానులు ఇలాగే కోరుకున్నారు అనిపిస్తుందట.బాలకృష్ణ మరియు బోయపాటిల కాంబోలో ముందు ముందు మరిన్ని సినిమాలు వస్తాయని అనిపిస్తుందట.. బాలకృష్ణ ను ఎలా చూపించాలో కేవలం బోయపాటికి మాత్రమే తెలుసని కాస్త సమయం ఎక్కువ తీసుకున్నా కూడా అద్బుతమైన సినిమా ను బాలయ్య తో బోయపాటి తీయగలడని అందుకే నందమూరి అభిమానులు మళ్లీ మళ్లీ బోయపాటి దర్శకత్వంలో సినిమాను బాలయ్య చేయాలని కోరుకుంటున్నారట.. అందుకు సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారని తెలుస్తుంది.బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న తదుపరి సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యిందట.అదే అల్లు అర్జున్ హీరోగా రూపొందబోతున్న సినిమా అని అల్లు అరవింద్ స్వయంగా ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోందని సమాచారం.. అయినా కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందట. బన్నీ సినిమా ఏమో కాని బాలయ్య తో మళ్లీ ఎప్పడు అంటూ అప్పుడే చర్చ మొదలయ్యిందట.