టాలీవుడ్ లో మొదలైన సరికొత్త సాంప్రదాయం..!!

Divya
సినీ ఇండస్ట్రీలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే అది ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా ఎక్కువ అవుతోందనే చెప్పాలి. ఒక్కొక్క హీరో ఒక్కో రకమైన పద్ధతిని ప్రవేశ పెడుతున్నారు.. అసలు విషయానికొస్తే సాధారణంగా సినిమా మొదలు పెట్టి.. షూటింగ్ చివరి దశకు వచ్చిన తర్వాతనే బిజినెస్ డీల్స్ మాట్లాడుకుంటారు నిర్మాతలు.. అదే పెద్ద పెద్ద సినిమాల విషయానికొస్తే కొంచెం ముందుగా డీల్స్ కుదుర్చుకోవడం జరుగుతూ ఉంటుంది.. ఆ సినిమాకు ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టక ముందే సినిమా బిజినెస్ గురించి మాట్లాడేసుకోవడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది..

బాలీవుడ్ లో అయితే పాపులారిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే డీల్స్ కుదుర్చుకుంటారు అని చెప్పవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో కూడా బాలీవుడ్ కి మించి రేంజ్ లో సూపర్ హిట్ సినిమాలు వస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి డీల్స్ కుదుర్చు కుంటున్నట్లు  సమాచారం. ఆ సినిమా ఏదో కాదు నాగార్జున నటిస్తోన్న బంగార్రాజు సినిమాను జీ సినిమా సంస్థ శాటిలైట్, డిజిటల్ హక్కులు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.. నిజానికి ఈ సినిమా ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాకముందే ఇలాంటి
డీల్స్ అయి పోవడం గమనార్హం.

ఇదే దారిలో పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి, రామ్ తాలూరి సినిమా కూడా మొదలు కాకముందే డీల్స్ అయిపోయింది అని చెప్పడంతో ఇండస్ట్రీ వర్గాల వారు ముక్కున వేలేసుకుంటున్నారు.. ఇదేంటి ఇప్పుడే కదా ప్రకటించింది ఇంకా కొబ్బరికాయ కూడా  కొట్టనిదే డీల్స్ అయిపోవడం ఏంటి అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు. కాకపోతే ఇలాంటి విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశమే అయినప్పటికీ టాలీవుడ్ కి మంచి చేస్తుందనే చెప్పాలి.. దీని వల్ల సినిమా యొక్క నిర్మాణం వేగంగా, సులభంగా అయిపోవడమే కాకుండా నిర్మాతలకు కూడా మంచి లాభాలు రావడం గమనార్హం..

అంతేకాదు సినిమాలు సమయానికి రావడంతో పాటు ప్రేక్షకులకు కూడా విసుగు తెప్పించే లాగా ఉండక పోవడమే మంచిది అని అంటున్నారు సినీ పెద్దలు.. సినిమాకు సంబంధించి డీల్ కుదుర్చుకుంటున్న అప్పుడే సినిమా డేట్ రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ తీసుకుంటున్నారట..ఇక పోతే టాలీవుడ్ లో కొత్త సాంప్రదాయంగా నిలుస్తున్న ఈ ట్రెండును ఇంకా ఎన్ని సినిమాలు ఫాలో అవుతాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: