
ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ పై.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?
ఈ అమ్మడికి ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉంది.. ప్రస్తుతం ఒకప్పుడు తన అందాల ఆరబోతతో అందరిని కలల ప్రపంచంలోకి నెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక పెళ్లి తర్వాత కూడా ఎప్పుడూ సోషల్ యక్టివ్ గానే ఉంటూ వస్తుంది. ప్రస్తుతం కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది కరీనా కపూర్. మొదటి అబ్బాయ్ తైమూర్ అలీఖాన్ ఇప్పటికే సెలబ్రిటీగా మారిపోగా. ఇటీవలే మరో అబ్బాయికి జన్మనిచ్చింది. అయితే ఇటీవలే ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది స్టార్ హీరోయిన్.
ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.. కరణ్ జోహార్ తో ఆన్లైన్ లో జరిగిన లైవ్ చాట్ షో లో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. గర్భధారణ సమయంలో మహిళలకు భర్త నుంచి సపోర్టు ఎంతో ముఖ్యం అంటూ తెలిపింది. గర్భధారణ సమయంలో మహిళల మానసిక శారీరక స్థితి కి అనుగుణంగా నడుచుకోవాలి అని సూచించింది. ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో భార్య నుంచి భర్తలు హాట్ నెస్ కోరుకో కూడదు అని.. గర్భధారణ సమయంలో సెక్స్ అనేక మందికి అపోహలతో కూడుకున్న అంశం అని చెప్పుకొచ్చింది కరీనాకపూర్. మహిళలూ గర్భంతో ఉన్న సమయంలో మగవాళ్ళ ఆలోచన శైలి మారాలి అంటూ చెప్పుకొచ్చింది.