అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లో అగ్నిప్రమాదం..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమా లో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటించ గా, శ్రీకాంత్ ప్రతి నాయకుడి పాత్ర లో నటించాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ సింహ, లెజెండ్ సినిమాలు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో ఈ సినిమా పై ప్రేక్షకులు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లో విడుదలయ్యింది, భారీ అంచనాలు ఉండటం తో థియేటర్ ల వద్ద కూడా జనాలు గుమి గూడారు. థియేటర్ లు ప్రేక్షకులతో అటు బాలకృష్ణ అభిమాను లతో కిక్కిరిసి పోయాయి. ఇలాంటి సందర్భం లోనే అఖండ సినిమా ప్రదర్శిస్తున్న ఒక థియేటర్ లో చిన్న అపశృతి చోటుచేసుకుంది.

అఖండ మూవీ ని ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం తో ప్రేక్షకులు భయం తో పరుగులు తీశారు. ఈ సంఘటన వరంగల్ నగరం లో చోటు చేసుకుంది, అఖండ మూవీ ని ప్రదర్శిస్తున్న జెమిని థియేటర్ లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించిం ది. ప్రేక్షకులు సినిమా చూస్తున్న సమయం లోనే ఒక్క సారిగా థియేటర్ నుండి పొగలు రావడం తో భయాందోళనల కు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు, వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం ఫైర్ సిబ్బంది కి ఫోన్ చేశారు. వెంటనే థియేటర్ దగ్గరికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు లోకి తీసుకు వచ్చారు. కాగా థియేటర్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ తో సినిమా థియేటర్ లో మంటలు చెలరేగినట్లు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: