చిరు 'గాడ్ ఫాదర్' పై థమన్ భారీ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు ఎస్.ఎస్.తమన్. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురం లో సినిమా తర్వాత తమన్ రేంజ్ మారిపోయింది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలకు సంగీతం అందిస్తు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. యువ హీరోల నుంచి మొదలుపెడితే అగ్రహీరోలు, సీనియర్ హీరోల సినిమాలకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు తమన్. ఈ మధ్య కాలంలో తమన్ ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఏ  పాటకు మ్యూజిక్ అందిస్తే ఆ పాట బ్లాక్బస్టర్ హిట్గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తన కెరీర్ లో మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవి సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

 తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'గాడ్ఫాదర్'. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ చిత్రానికి ఇది తెలుగు రీమేక్ గా రూపొందుతోంది.ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం తమను అదిరిపోయే ట్యూన్స్ ని సిద్ధం చేశాడు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఓ భారీ అదిరిపోయే అప్డేట్ అందించాడు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే కదా.

 అయితే ఈ సినిమా కోసం చిరంజీవి సల్మాన్ ఖాన్ ఇద్దరూ కలిసి ఉండే ఒక మాస్ సాంగ్ ను తను కంపోజ్ చేస్తున్నట్లు తెలిపాడు. అంతే కాకుండా ఈ సాంగ్ ట్యూన్ కూడా చాలా బాగా వస్తుందని.. కచ్చితంగా ఈ పాట మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని ఆ ఇంటర్వ్యూలో తమన్ తెలిపాడు. దీంతో ఈ సినిమాపై మరో సారి అంచనాలు పెరిగిపోయాయి. సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తుండటమే కాకుండా చిరంజీవి సల్మాన్ ఖాన్ ల మధ్య ఒక మాస్ సాంగ్ ని పెట్టడం అనేది నిజంగా విశేషం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: