పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసిన సమంత.. మళ్లీ ఫామ్ లోకి?

praveen
దక్షిణాది చిత్రపరిశ్రమలో దాదాపు దశాబ్దకాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది సమంత. ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక ఆ తర్వాత నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని కోడలు గా మారిపోయింది. అయితే అక్కినేని కోడలు గా మారిన తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేసింది. కేవలం నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు మాత్రమే చేసుకుంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక రంగస్థలం సినిమా లో తప్ప స్టార్ హీరోల సరసన నటించడం పూర్తిగా మానేసింది.

 అయితే ఇటీవలే భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చినసమంత మళ్లీ కెరీర్ పైనే దృష్టి పెట్టింది మరోసారి స్టార్ హీరోయిన్గా రాణించాలని అనుకుంటుంది. అవకాశం వస్తే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతుంది పూజా హెగ్డే. దక్షిణాదిలోనే  కాదు ఉత్తరాదిలో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీబిజీ గా మారిపోయింది.. అయితే ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకున్న పూజా హెగ్డే.. డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఈ సినిమాను వదులుకుందట.

 ఇక ఇప్పుడు సమంత మళ్లీ ఈ సినిమా అవకాశం దక్కించుకుని ఫామ్లోకి రావాలని భావిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతుంది.  మరి కొన్ని రోజుల్లో సినిమా పట్టాలెక్కపోతుంది.  ఈ సినిమాలో ముందుగా మహేష్ బాబు కు జోడిగా పూజా హెగ్డేను తీసుకోవాలని అనుకున్నారట. కానీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజాహెగ్డే డేట్లు ఖాళీ లేకపోవడంతో ఇక ఈ ప్రాజెక్టును వదులుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఇక చిత్ర బృందం పూజా హెగ్డే ప్లేస్ లో  సమంత ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. దీని కోసం సమంతను అడగ్గా.. సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: