వరుస భారీ విజయాలతో స్టార్ దర్శకుడిగా ముందుకు సాగిపోతున్నాడు కొరటాల శివ. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా తోనే ఆయన భవిష్యత్తులో పెద్ద దర్శకుడు అవబోతున్నాడు అని హింట్ ఇచ్చేశాడు. దానికి తగ్గట్లుగానే శ్రీమంతుడు జనతా గ్యారేజ్ భరత్ అను నేను అనే సినిమాలను చేసి వాటి ద్వారా సూపర్ హిట్ అందుకొని బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాడు నిర్మాతలకు. ఆయనతో సినిమా చేస్తే తప్పకుండా హిట్ గ్యారెంటీ అన్న లెవల్లో కొరటాల శివ పేరు మారుమోగిపోయింది.
ఆ విధంగా ఆయన మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే అవకాశాన్ని ఇప్పుడు అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఇప్పుడు పూర్తి కాగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది ఇప్పటివరకు. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇటీవలే ప్రకటించగా ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ అనే సినిమా లాగా ఇప్పుడు ఈ సినిమా రావడం అందరినీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఎంతో సంతోష పెడుతుంది.
ఈ చిత్రం కోసం ఆయన రెగ్యులర్ గా చేసే స్క్రిప్ట్ ను కాదని రివెంజ్ నేపథ్యం లో కథ తయారు చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. సామాజిక అంశాలను మాస్ కమర్షియల్ చిత్రాలలో ఇమిదించి సినిమా లు చేసే కొరటాల ఈ సినిమాలో తన స్టైల్ కాదని సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు. కొరటాల శివ ఈ సారి చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి. ఈ సినిమాలో పూజా హెగ్డే నేను కథానాయికగా ఆలోచిస్తుండగా మరొక హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోవాలని భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న ఈ సినిమా ఈ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.