సంక్రాంతి రిలీజ్ డైలమా.. తగ్గేదేవరు?

P.Nishanth Kumar
2021 సంవత్సరం సంక్రాంతి కానుకగా టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకేసారి అన్ని పెద్ద సినిమాలు విడుదల కావడం టాలీవుడ్ సినిమా చరిత్రలోనే తొలిసారి కావచ్చు. అందుకే ఎన్నడూ లేని విధంగా సినిమా వారు పోటీ పదుతున్న ఈ పెద్ద వార్ ఏం జరగబోతుందో అని ఎంతగానో టెన్షన్ పడుతున్నారు. థియేటర్ లలో అక్యుపన్సి వందకు వంద శాతం కలిసి రావడంతో కొన్ని రోజులుగా విడుదలకు నోచుకోని కొన్ని సినిమాలు ఇప్పుడు విడుదల అయ్యే విధంగా ప్రణాళికలు వేసుకుంటున్నాయి.

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలలో రెండు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అలాగే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్రేజీ హీరోలు గా ఉన్న వారి సినిమాలు కూడా మరో రెండు ఉన్నాయి. అయితే ఇన్ని సినిమాలు ఒకేసారి వస్తే తప్పకుండా భారీ నష్టం వాటిల్లుతుందని సినిమా డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన. ఈ నేపథ్యంలో వీరి లో ఎవరు వెనక్కి తగ్గుతారు అన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ముందుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉంది.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, సర్కార్ పాట, రాధే శ్యామ్ చిత్రాలు రాబోతున్నాయి. ఎవరికి వారు తమ సినిమా మీద మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అందుకే ఎవరూ కూడా వారి వారి సినిమాలను వాయిదా వేసేందుకు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై ఎక్కువ ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఆయన అయినా వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ తన సినిమా ను వెనక్కి తీసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతూ ఉండగా రాజమౌళి కూడా స్వయం గా రంగం లోకి దిగడం చూస్తుంటే ఇప్పుడు ఏమవుతుందో అన్న అసక్తి నందరి లో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: