రెబల్ స్టార్ ప్రభాస్ సీనియర్ స్టార్ నటుడు కృష్ణంరాజు సోదరుడి కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఇంటి ఇచ్చి... ఇప్పుడు తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈశ్వర్ సినిమాతో స్టార్ట్ చేసిన తన కెరియర్ అంచలంచలుగా పెరిగి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. ప్రభాస్ నటించిన ఈ సినిమా పెద్దగా హిట్ అనుకోకపోయినా తన నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత వర్షం సినిమాతో ఘన విజయం సాధించిన డార్లింగ్ ప్రభాస్ వీటి తర్వాత అడవి రాముడు, చక్రం, ఛత్రపతి ఇలా వరుస సినిమాలతో హిట్ల మీద హిట్లు అందుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా డార్లింగ్ ప్రభాస్ గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు.
వీటి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఇండియా మూవీ బాహుబలి ఈ సినిమాతో హీరోగా తనకంటూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసుకున్నాడు రెబల్ స్టార్. రాజమౌళి పైన నమ్మకం పెట్టుకొని ఐదేళ్లపాటు ఈ సినిమా తప్ప వేరే సినిమా చేయలేదు ప్రభాస్ అయితే ఈ సినిమాతో ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు తన కష్టానికి మంచి ఫలితం దక్కింది. అయితే ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్న రెబల్ స్టార్ అసలు హీరో కాకపోతే ఏమైపోయేవాడో మనకు తెలుసా...?రెస్టారెంట్ బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడట ఈ విషయాన్ని మరెవరో కాదు ప్రభాస్ స్వయంగా గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టాడు.
చదువుకున్న చదువు కి ఇంటర్వ్యూలో పాల్గొనే అంత ఓపిక తనకు లేదంటూ హైదరాబాద్లో ఉత్తరాధి ఆహారాలకు చాలా డిమాండ్ ఉందిని హీరో కాకపోయుంటే తప్పకుండా రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసేవాడిని అని నిర్మొహమాటంగా ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ప్రభాస్ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనకలవాటట. తన పాన్ ఇండియా రేంజ్ హీరో అయినా కూడా అందరితో కలిసి మెలిసి ఉంటారు. అందుకే రెబల్ స్టార్ ను సినిమాల్లోనే కాకుండా బయట నాచురాలిటీ ని కూడా అందరూ ఇష్టపడతారు. అంతేకాకుండా ప్రభాస్ ఆహార ప్రియుడు తన తినడమే కాకుండా సెట్స్ లో లో తన ఫ్రెండ్స్ కి కూడా చూపిస్తాడట ఈ విషయంలో కూడా తన అభిమానులు బాగా ఇష్టపడతారు.