అందాల ముద్దు గుమ్మ సమంత, నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ నటనకు, అంద చందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో పాటు ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. అందులో భాగంగా పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం కమర్షియల్ సినిమాలకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎప్పటికప్పుడు తన పాత్రకు ప్రాముఖ్యత ఉండే సినిమాల్లో నటిస్తూ అలాగే లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సమంత తెచ్చుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా సమంత మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.
సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకున్న సమంత ఈమధ్య ది ఫ్యామిలీ మాన్ సీజన్ టు వెబ్ సిరీస్ ద్వారా కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఇలా సినిమా లతో, వెబ్ సిరీస్ ల తో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న సమంత సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులతో అనేక విషయాలను పంచుకొనే ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు తన అంద చందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజా గా కూడా సమంత కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో సమంత ఎరుపు రంగు పూల డిజైన్ కలిగిన డ్రెస్ ను ధరించి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.