పాన్ ఇండియా హీరో ప్రభాస్ టాప్ 4 టైటిల్ సాంగ్స్ ఇవే?
* ప్రభాస్ హీరో గా 2004 లో విడుదలైన చిత్రం "వర్షం". ఈ సినిమా ప్రభాస్ ను ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టడానికి గట్టి పునాది వేసిందని చెప్పాలి. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ పెద్ద హిట్ అయింది. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ మూవీ టైటిల్ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. నిజానికి ఈ సినిమాలో రెండు టైటిల్ సాంగ్స్ అని చెప్పాలి. ఒకటి "ఎన్నాళ్ళకి గుర్తొచ్చానే వాన..ఎన్నాలని దాక్కుంటావే పైన...". అలాగే ఇంకొకటి "ఈ వర్షం సాక్షిగా తెలుపని నువు నాకే సొంతం..." ఈ రెండు పాటలు కూడా టైటిల్ కి సంబంధించినవే.
* యోగి సినిమాలో "ఒరోరి యోగి నన్ను కుదిపెయ్ రోయ్..." అనే సాంగ్ అప్పట్లో కుర్రకారును హోరెత్తించింది. ఈ పాట టైటిల్ సాంగ్ మాత్రమే కాదు ఆ చిత్రంలో ఐటెం సాంగ్ కూడా, అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్ నటి ముమైత్ ఖాన్ ఈ పాటలో తన అందచందాలతో డాన్స్ లోని గ్రేస్ తో అదరగొట్టింది. ఇక ప్రభాస్ స్పీడ్ గురించి వేరే చెప్పక్కర్లేదు, ఆడియన్స్ తో ఆపకుండా విజిల్స్ వేయించాడు.
* బిల్లా మూవీ లోనూ టైటిల్ సాంగ్ "మై నేమ్ ఈజ్ బిల్లా బి ఫర్ బిల్లా..." గొప్ప ఆదరణ పొందింది. సినిమాలో డార్లింగ్ క్యారెక్టర్ ఏంటా అన్న విషయాన్ని ప్రేక్షకుల ముందు పెట్టేసింది. క్లాస్ గా కనిపిస్తూ వీర మాస్ లో వినిపించే ఈ టైటిల్ సాంగ్ దుమ్ము దులిపేసిన విషయం తెలిసిందే.
* ఆ తరవాత 2013 లో వచ్చిన "మిర్చి" మూవీ టైటిల్ సాంగ్ కూడా సూపర్ హిట్ సక్సెస్ ను అందుకుంది. "మిర్చి మిర్చి లాంటి కుర్రాడు.." అనే పాట ప్రభాస్ ఫ్యాన్స్ కి మధురమైన ఘాటు మిర్చి బజ్జీ రుచి చూపించింది. పాటే కాదు సినిమా కూడా బ్లాక్ బస్టర్ ను సాధించింది.
ఇలా కొన్ని ప్రభాస్ సినిమాలోని టైటిల్ సాంగ్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి..