
ఏపీ ప్రభుత్వం పై ఫైర్ అవుతున్న చిరంజీవి..కారణం..?
ఆదివారం రోజు జరిగిన సంతోషం-సుమన్ టీవీ సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్-2021 కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు..ఇక విన్నర్స్ కు తన చేతుల మీదగా ఆయన అవార్డ్స్ అందించడంతో పాటు సినిమా ఇండస్ట్రీ పై ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన ఖండించారు. టిక్కెట్ల రేట్లు విషయంలో ఏపీ ప్రభుత్వం మొండిపట్టు వీడాలని ఆయన సభాముఖంగా పేర్కొన్నారు. అంతే కాదు చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా వాళ్లే కదా ..? వీళ్ళది ఏముంటుంది అని మమ్మల్ని నిర్లక్ష్యం చేయకండి.. కొన్ని లక్షల కుటుంబాలు ఈ సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి.
వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటే.. మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నట్లు కాదు..తెలుగు సినీ ఇండస్ట్రీ పేరుప్రఖ్యాతులు పెంపొందించుకోవడం కోసమే కష్టపడి అప్పుతెచ్చి మరి సినిమాలు తీస్తున్నాము. మీకు కావలసిన ,రావలసిన టాక్స్ మీరు తీసుకోండి.. ఎవరూ అభ్యంతరం చెప్పరు.. కానీ దయచేసి సినిమా టికెట్ల రేట్లను పెంచండి.. మీరు సినిమా రేట్లను పెంచకపోతే తెలుగు సినీ పరిశ్రమ పడిపోవడమే కాకుండా కోట్లు ఖర్చు పెట్టి పెద్ద సినిమాలు చేసే స్థోమత కూడా లేకుండా పోతుంది. ప్రేక్షకులు కోరుకునే సినిమాలను తియ్యాలి అనుకుంటాము కానీ మీ వల్ల తీయలేక పోతున్నాము. ఎంతో మంది సినీ కార్మికులు తినడానికి తిండి లేని సమయాలు కూడా గడుపుతున్నారు.. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని సినిమా టికెట్ల రేట్లను పెంచండి. మిమ్మల్ని మీట్ అయి ఈ విషయం గురించి చర్చించుకుందాం అనుకున్నాము.. కానీ మీ నుంచి రెస్పాండ్ రాకపోయేసరికి.. ఇలా సభాముఖంగా అందరి ముందు చెప్పేస్తున్నాను అంటూ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు.