బిగ్ బాస్ స్క్రిప్టెడ్.. అసలు నిజం చెప్పిన విశ్వ?

praveen
బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో లో ప్రారంభమైన బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఒక ఇండస్ట్రీలో మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీల్లో బుల్లితెరపై కూడా బిగ్బాస్ కార్యక్రమానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్ని కార్యక్రమాలు వచ్చిన ఎక్కువగా బిగ్బాస్ కార్యక్రమం చూడటానికి  ఇష్టపడుతూ ఉంటారు.. ఇక మనకు తెలిసిన సెలబ్రిటీల గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తి చూపుతుంటారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య తరచూ గొడవలు జరగడం వింతైన కారణాలు చెబుతూ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవడం.. చిన్నచిన్న కారణాలకే పెద్దగా గొడవలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

 తర్వాత కాసేపటికి మళ్ళీ అందరూ కలిసి పోయి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో జరిగే సంఘటనలు చూసీ రియాల్టీ షోలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ స్క్రిప్టెడ్  అన్న ఒక టాక్ ఉంది  అక్కడ నిర్వాహకులు వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ నటిస్తూ ఉంటారు అంటూ ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఎలిమినేట్ అయ్యే బయటికి వచ్చిన వారు ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఇటీవలే బిగ్ బాస్ ఐదవ సీజన్ లో 9వ వారం లో ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన విశ్వ బిగ్ బాస్ గురించి అసలు నిజాలు బయట పెట్టాడు.

 అందరూ అంటూ ఉంటారు బిగ్బాస్ స్క్రిప్టెడ్ షో అని కానీ... అందరూ అనుకున్నట్లుగా బిగ్బాస్ స్క్రిప్టెడ్ కాదు అందులో జరిగేవన్నీ కూడా వాస్తవంగా జరిగేవే అంటూ బిగ్ బాస్ షో గురించి అసలు విషయం చెప్పి ప్రేక్షకులందరికీ క్లారిటీ ఇచ్చాడు విశ్వ. అయితే తనకు వైల్డ్ కార్డు ఎంట్రీ వస్తుందేమో అని ఆశపడుతున్నాను. హౌస్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ విశ్వా చెప్పుకొచ్చాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది అని ఆశతో ఇప్పటివరకు మీడియాకు ఎక్కడా కనిపించలేదు అంటూ తెలిపాడు. ఇక బిగ్ బాస్ సీజన్ లో విజేత శ్రీ రామచంద్ర అవుతాడు అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు విశ్వ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: