పుష్ప సినిమా సింగర్ మౌనిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Divya
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకుడిగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న చిత్రం పుష్ప. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ఆడియన్స్ లో సరికొత్త క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి.. పోస్టర్లు, టీజర్లను పక్కన పెడితే ఈ సినిమా పాటలకు విశేష ఆదరణ లభిస్తోంది..తాజాగా  విడుదలైన దాక్కో దాక్కో మేక, శ్రీ వల్లీ, సామి సామి  పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారడమే కాకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన సామి సామి అనే ఈ పాట ఆడియన్స్ ను బాగా కట్టిపడేసింది. ఇకపోతే ఈ  క్రెడిట్ అంతా ఈ పాట ని అంత జోష్ తో పాడిన సింగర్ మౌనిక యాదవ్ కే సొంతం అని చెప్పాలి.
ఈ పాటకు తన ప్రాణం పెట్టి పాడిందని చెప్పవచ్చు. అయితే మౌనిక గురించి చాలామందికి పెద్దగా తెలియదు. ఇక ఈమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మౌనిక కరీంనగర్ జిల్లా కనపర్తి గ్రామంలో జన్మించింది.. ఆరవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న మౌనిక కు ఒక అక్క కూడా ఉంది. ఆమె పేరు పద్మావతి. పద్మావతి ఎక్కువగా జానపద పాటలు పాడుతూ ఉంటుంది.. అక్క ప్రోత్సాహంతో మౌనిక కూడా పాటలు పాడటంలో నైపుణ్యం పొందింది..
మొదటిసారి 2009లో జరిగిన ప్రజా చైతన్య యాత్ర లో పాటలు పాడి తెలంగాణ ఉద్యమాన్ని రక్తికట్టించింది మౌనిక. అంతేకాదు ఆ తరువాత తెలంగాణలో ఏ ఉద్యమం జరిగినా కూడా మౌనిక ను ఆహ్వానించి ఈమె చేతపాటలు పాడించేవాళ్ళు. కెసిఆర్ ప్రత్యేక తెలంగాణా ని ఏర్పాటు చేసిన తర్వాత మౌనిక కు సాంస్కృతిక సారధి లో ఉద్యోగాన్ని కూడా ఇచ్చారు. ఇక ఈమె పాడిన పాటలు యూట్యూబ్ లో బాగా ప్రావీణ్యం పొందాయి.. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే దర్శకుడు సుకుమార్ ఏరికోరి మరీ మౌనిక తో పుష్ప సినిమాలో సామి సామి పాటను  పాడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: