విలన్ గా అడుగులు వేస్తున్న అది పినిశెట్టి..!!
అది పినిశెట్టి వి చిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రికి పరిచయమైయ్యాడు. ఆ తరువాత తమిళ్ లో మిరుగమ్ సినిమాతో తెరంగ్రేటం చేశాడు. ఆయన నటించిన కొన్ని సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేయగా.. ఆ సినిమాలు తెలుగులోనూ మంచి ఆదరణ పొందాయి. అంతేకాదు.. అది పినిశెట్టి బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ త్రెసా హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి ధీటుగా అది పినిశెట్టి తన విలనిజాన్ని చూపించాడు. ఈ సినిమా తరువత ఆయనకు వరుస సినీ అవకాశాలు వచ్చాయి. ఆయన పలు సినిమాలో విలన్ గా నటించారు.
ప్రస్తుతం అది పినిశెట్టి హీరోగా పలు సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఆయన తాజాగా మరోసారి విలన్ అవతారంలో కనిపించనున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమాలో అది విలన్ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తుంది. కాగా.. అది పినిశెట్టి సరైనోడు సినిమా తరువాత పూర్తి స్థాయిలో విలన్ గా నటిస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమా తరువత ఆదికి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి మరి. ఏది ఏమైనప్పటికి అది హీరోగా, విలన్ గా రెండు పాత్రలలో నటిస్తూ బిజీ అయిపోయారు.