భీమ్లా నాయక్ విడుదల వాయిదా పడిన ఆలస్యం లేకుండానే వస్తుందట..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరొక హీరోగా కనిపించబోతున్నాడు, ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్-ప్లే ను అందిస్తున్నాడు. ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కోషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, టీజర్, పాటలను చిత్రబృందం బయటకు వదలగా వీటికి జనాల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను చిత్ర బృందం చకచకా పూర్తి చేస్తోంది . ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించిన తరువాత అనూహ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనితో ఆర్ఆర్ఆర్ సినిమాకు భీమ్లా నాయక్ సినిమా విడుదలకు కేవలం వారం వ్యవధి మాత్రమే ఉంటుంది.


 ఆర్ఆర్ఆర్ సినిమా  దాదాపు రెండు, మూడు వారాల పాటు కలెక్షన్లను భారీగా రాబట్టే అవకాశం ఉంది. అందువల్ల భీమ్లా నాయక్ సినిమాను జనవరి 12 వ తేదీన విడుదల చేసినట్లు అయితే భీమ్లా నాయక్ సినిమా కలెక్షన్ లపై చాలా ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. సినిమాను ఒక వేళ వాయిదా వేసినా కూడా చాలా స్వల్ప కాలం వ్యవధిలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనట్లయితే , జనవరి 26 వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి భీమ్లా నాయక్ సినిమా ముందుగా చెప్పినట్టుగానే సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అవుతుందా? లేకపోతే వేరే ఏదైనా తేదీలో విడుదలవుతుందా తెలియాలంటే  చిత్రబృందం అఫీషియల్ ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: