రాజారాణి@ అందమైన ఫ్లాష్ బ్యాక్?

praveen
సాధారణంగా లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు నేటి రోజుల్లో ఎక్కువగానే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ ఒక అందమైన లవ్ స్టోరీతో ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తూనే ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ ఇచ్చే విధంగా వస్తున్న సినిమాలు నేటి రోజుల్లో చాలా తక్కువగానే ఉన్నాయి. ఇలాంటి ఒక అందమైన కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా రాజా రాణి. ఇది ఒక తమిళ సినిమా.. తెలుగులో డబ్ అయింది.. అయితే ఈ సినిమాలో ఉన్న మెసేజ్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయిపోయింది. ఇక ఈ సినిమా ప్రతి ఒక్కరిని కూడా లవ్ ఫీల్ లోకి తీసుకు వెళుతుంది  ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన ఘటనలు చూపిస్తోంది.


 ప్రేమ దూరం అయిన తర్వాత జీవితం వృధా అయిపోయింది అనుకునే ప్రతి ఒక్కరికీ కూడా సరికొత్త ఆశలను రేకెత్తిస్తుంది ఈ సినిమా. ఈ సినిమాలో ప్రధాన పాత్ర లో నటించారు ఆర్య, నయనతార. ఇక ఈ సినిమా మొదలవ్వగానే ఆర్య, నయనతార లకు పెళ్లి అవుతుంది. అయితే వీరిద్దరూ అప్పటికే వేరొకరిని ప్రేమించి వారూ దూరం కావడంతో అదే బాధలో కొనసాగుతూ ఉంటారు. కుటుంబ సభ్యులకు ఒత్తిడితో పెళ్లి చేసుకుంటారు. కానీ ఒకరంటే ఒకరు భార్యాభర్తలుగా మాత్రం అస్సలు కొనసాగారు. ఇలాంటి సమయంలోనే భార్య గా ఉన్న నయనతారకు ఆర్య స్నేహితుడు.. ఆర్యకు  నయనతార తండ్రి ఫ్లాష్ బ్యాక్ చెబుతారు.



 అయితే ఆర్య ఒక అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమించాడు. ఇక ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసి ఒప్పిస్తాడు. ఇక ఇద్దరూ ప్రేమలో కొనసాగుతున్న సమయంలో విధి చిన్నచూపు చూస్తోంది. దీంతో ఆర్యా కళ్ళముందే ప్రేమించిన అమ్మాయి రోడ్డు ప్రమాదంలో చనిపోతుంది. దీంతో ఇక అదే రోడ్డుమీదికి వెళ్లి అక్కడే నిలబడి రోజు తన ప్రేయసిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు ఆర్య. ఆ తర్వాత వచ్చి స్నేహితుడు ఇక్కడితోనే లైఫ్ అయిపోయింది అనుకోవద్దు అని చెప్పడంతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అయితే అటు నయనతార కూడా గతంలో ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అతడే ప్రాణంగా బతుకుతుంది ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధం అవుతోంది. కానీ తండ్రికి భయపడిన సదరు వ్యక్తి తనను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడు. అంతే కాదు కనిపించకుండా పారిపోతాడు. దీంతో నయనతార గుండె పగిలిపోతుంది. అదే బాధతో ఉంటుంది. కానీ తండ్రి తో పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తర్వాత భార్య భర్తల మధ్య కొన్నాళ్ల వరకూ మనస్పర్ధలు ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరికి ప్రేమ పెరిగిపోతుంది. ఇలా పెళ్లి తర్వాత కూడా అందరికీ ఒక మంచి జీవితం ఉంటుంది అని సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: