అనుష్క ఎన్ని కోట్లకు అధిపతి రాలో తెలుసా..?
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా తనదైన శైలిలో నటించి అందరినీ ఆకట్టుకుంది స్వీటీ.. ఇదిలా ఉండగా ఈమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎంత సంపాదించింది..ఇక మొత్తంగా ఈమె దగ్గర ఎంత ఆస్తి ఉంది అనే విషయం తెలుసుకున్నట్లయితే.. అనుష్క తన దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ కు ఏకంగా 12 లక్షల రూపాయలు వెచ్చించి ఒక కారు గిఫ్ట్ గా ఇచ్చింది.ప్రస్తుతం స్వీటీ బెంగళూరు లో తన నివాసం ఉంటున్న ఇంటి ధర ఏకంగా 12 కోట్ల రూపాయలు. సుమారుగా 50 సినిమాలకు పైగా నటించిన స్వీటీ 150 కోట్ల రూపాయలు వెనుక వేసినట్లు సమాచారం. అంతేకాదు సుమారుగా 20 నుంచి 30 కోట్ల రూపాయలు వరకు వాణిజ్య ప్రకటనల ద్వారా సొంతం చేసుకుందట.
అంతేకాదు బెంగళూరు, హైదరాబాద్ , మంగళూరు, వైజాగ్ వంటి మహానగరాలలో ఈమెకు స్థిరాస్తి ఉన్నట్లు కూడా సమాచారం. అంతేకాదు స్వీటీ తన డబ్బులను మొత్తం విలువైన కార్లు, ఖరీదైన వజ్రాలు, బంగారం వంటివి కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుందట. ఇక ఇంత సంపాదించిన అనుష్క ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడం వెనుక రకరకాల కథనాలు వస్తున్నప్పటికీ, ఆమె ఏమాత్రం స్పందించడం లేదు.