సుడిగాలి సుధీర్.. అదిరిపోయే డాన్స్.. చూస్తే షాకే?
ముఖ్యంగా సుడిగాలి సుధీర్ కి క్రేజ్ రావడానికి జబర్దస్త్ యాంకర్ రష్మీ కారణం అని చెప్పాలి. వీరిద్దరి మధ్య ఉండే లవ్ ట్రాక్ తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఎంతగానో ఆకర్షించింది. సుడిగాలి సుధీర్ రష్మీ పై తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి చెప్పే డైలాగ్ లు అందరినీ ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. అయితే సుడిగాలి సుదీర్ కేవలం జబర్దస్త్ లో కమెడియన్ గా మాత్రమే కాకుండా ఒక మెజీషియన్ గా కూడా తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. అంతేకాదు ఇటీవల కాలంలో పలు కార్యక్రమాలలో యాంకరింగ్ కూడా చేస్తూ అదరగొడుతున్నాడు ఈ జబర్దస్త్ కమెడియన్.
అంతేకాదండోయ్ అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ లు కూడా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఈటీవీ లో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో లో టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు. ఇక అప్పుడప్పుడు స్టేజి మీద డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం డి 13వ సీజన్ కాస్త క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ఇక ఈ క్వార్టర్ ఫైనల్స్ కి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదల చేయగా ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగం గా సుడిగాలి సుధీర్ అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోని నీ తాత టెంపర్ నీ అయ్య టెంపర్ అనే పాటకు డాన్స్ చేశాడు సుడిగాలి సుధీర్. అదిరిపోయే స్టెప్పులు తో ఆకట్టుకున్నాడు.