అన్ఎక్స్పెక్టెడ్ హీరోతో అనిల్ రావిపూడి.. వర్కౌట్ అయ్యేనా..?

Thota Jaya Madhuri
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్స్ కంటే ఎక్కువ‌గా గుర్తింపు పొందుతూ.. హిట్‌కి గ్యారెంటీ ఇస్తున్న డైరెక్టర్ పేరు అనిల్ రావిపూడి. ఆయన సినిమాలు తెరకెక్కిస్తే  ఖచ్చితంగా వంద కోట్లు కనీసం కలెక్ట్ అవుతాయని అభిమానుల నమ్మకం. ప్రేక్షకులను నవ్వించడం, కుటుంబ ఆడియన్స్‌ను పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అందించడం లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సినిమాకి వెళ్తే కనీసం రెండు గంటల నుండి రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు అన్ని సమస్యలను మరచి హ్యాపీగా నవ్వుతారు, ఇలాంటి సీన్స్ ప్రేక్షకులను పూర్తిగా మాయ చేయడం విశేషం. మరీ ముఖ్యంగా "సంక్రాంతికి వస్తున్నం" సినిమా తరువాత ఆయన రేంజ్ ఇంకా పెరిగిపోయింది.

 

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఇప్పుడు  చేస్తున్న ప్రాజెక్ట్ మరింత స్పెషల్. ఈ సినిమా లో స్టార్ హీరో చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్‌గా నయనతార నటిస్తుంది, రెండవ హీరోయిన్‌గా కేధరిన్ కనిపిస్తుంది. ఈ కాంబో పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి వేరే లేవల్ లో ఈ సినిమాలోని సీన్స్ తెరకెక్కిస్తున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సినిమా గురించి ట్రెండ్ పెద్దగా పెరుగుతుంది. మూవీ మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు వేరే లెవల్ హిట్ అందుకున్నాయి. కాగా ప్రసెంట్ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.  అనిల్ రావిపూడి మరియు రామ్ పోతినేని కాంబోలో ఓ  సినిమా రాబోతుందట. ఈ కాన్సెప్ట్ మరింత ఆకట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ కాంబో పై ప్రేక్షకులు, ఫ్యాన్స్, సినీ క్రిటిక్స్ తమ స్పందనను తెలియజేస్తూ, “రామ్ పోతినేని యాక్టింగ్ + అనిల్ రావిపూడి డైరెక్షన్ = రచ్చరంబో!” అని కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ ఈ కాంబోతో ఒక నాటి లవ్ స్టోరీని కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ, సూపర్ లెవల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి, ఈ భారీ కాంబినేషన్ ఎంతవరకు వర్క్ అవుతుందో..? మరియు సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకులను ఎంత మేరకు అలరించగలదో...?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: