అఖండ 2: నెగటివ్ రివ్యూల పై నిజం ఒప్పుకున్న నిర్మాతలు..!
ముఖ్యంగా బాలకృష్ణ చెప్పే డైలాగ్స్, నటన అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. సనాతన ధర్మం గురించి చూపించిన అంశాలు కూడా హైలెట్ గా నిలిచాయి. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మేకర్స్ ఒక సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్లో నిర్మాతలు అఖండ 2 చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కావాలనే కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఈ విషయంపై ఎలా స్పందిస్తారని అడగగా... ప్రేక్షకుల నుంచి అఖండ 2 సినిమాకు మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. గంటకు 25 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయని తెలిపారు.
కేవలం ఇది తెలుగులోనే కాదు హిందీలో కూడా మంచి టాక్ వచ్చింది. కానీ తెలుగులో కొన్ని నెగిటివ్ రివ్యూలు రాయడం కూడా నిజమే, మేము ఆ విషయాన్ని గమనించాము. రివ్యూ విషయంలో ఎవరి ఒపీనియన్ వారిదే, కానీ రియాలిటీ వేరుగా ఉంటుందని తెలిపారు. రివ్యూలతో సంబంధం లేకుండా మా అఖండ 2 చిత్రం దూసుకుపోతోంది అంటూ తెలియజేశారు. అలా అఖండ 2 చిత్రం పైన వస్తున్న నెగటివ్స్ పై నిర్మాతలు ఈ విధంగా కామెంట్స్ చేశారు. మరి మొదటి రోజు కలెక్షన్స్ పైన బాలయ్య అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించి చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తారేమో చూడాలి మరి.