టాలీవుడ్ లో తన సత్తా చాటిన మాలీవుడ్ హీరో..!!
దుల్కర్ సల్మాన్ మలయాళం, తమిళ్ సినిమా లలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అంతేకాదు మొట్టమొదటిసారి గోల్డెన్ వీసా ను సొంతం చేసుకున్న నటుడిగా కూడా గుర్తింపు పొందాడు.అంతే కాదు ఇలాంటి గోల్డెన్ వీసాలు దక్కడం అరుదైన విషయం. కొన్ని వేల మందిలో ఒకరికో ఇద్దరికో మాత్రమే ఇలాంటి గోల్డెన్ వీసాలు లభిస్తాయట.
దుల్కర్ సల్మాన్ మొదట ఓకే బంగారం అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించాడు..అయితే ఈయనకు అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా తెర మీదకు వచ్చిన మహానటి సినిమాలో ఆమె భర్త జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అంతేకాదు నిజంగానే జెమినీ గణేషన్ ఇలా ఉండేవాడా అని ప్రేక్షకులు అనుకునే లాగా దుల్కర్ సల్మాన్ నటించి ప్రేక్షకుల విశేష ఆదరణ పొందాడు. మాలీవుడ్ మెగాస్టార్ కొడుకు తెలుగులో ఇంతటి ప్రశంశ మైన గుర్తింపు పొందడం విశేషం.ఏది ఏమైనా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే తెలుగులో తమ సత్తా ఏంటో చాటుతున్నారు.